మహిళా సమాజానికి కేసీఆర్ క్షమాపణ చెప్పి తీరాలి.. విజయశాంతి డిమాండ్..!

Thursday, February 11th, 2021, 03:00:45 AM IST


నల్గొండ జిల్లా హాలియాలో నేడు టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ సభలో ప్రసంగిస్తూ మధ్యలో కొందరు మహిళలను కుక్కలు అంటూ సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసిన బీజేపీ నాయకురాలు విజయశాంతి మహిళలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అయితే ఓటములతో ఫ్రస్ట్రేషన్ ఎక్కువయి తెలంగాణ ప్రజలను కుక్కలని, వేదన చెప్పుకోవడానికి వచ్చినవాళ్ళను ఈడ్చుకుపోవాలని, మేం తల్చుకుంటే నసుమైపోతారని స్వయంగా సీఎం గూండా గిరికి తెగబడుతుంటే, ఆ దొరహంకారానికి కర్రుకాల్చి ఓటు ద్వారా వాత పెట్టాల్సిన జిమ్మేదారీ ప్రజలు తీసుకోక తప్పదని అన్నారు. బాధిత మహిళలు కుక్కలా అని ఆడబిడ్డలను కుక్కలన్నందుకు యావత్ మహిళా సమాజానికి ఈ ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పి తీరాలని విజయశాంతి డిమాండ్ చేశారు.