తెలంగాణ సమాజం తిరుగుబాటుకు సిద్ధమయ్యింది.. విజయశాంతి సంచలన వ్యాఖ్యలు..!

Tuesday, December 29th, 2020, 03:00:35 AM IST


టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడింది. ముఖ్యమంత్రి గారు ఓటమి అయోమయంలో, కేసులు భయంలో చివరికి ప్రజలను కూడా బెదిరించే స్ధాయికి దిగి వ్యవహరిస్తున్నారని,
ఈ రోజు రైతు కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తాం, 7500 కోట్ల నష్టం వస్తుంది అంటున్న ఈ దుర్మార్గపు ప్రభుత్వం రేపు 4 లక్షల కోట్లు అప్పులు వలన పెన్షన్ లు ఇవ్వలేము, డబుల్ బెడ్రూం లు కట్టలేము అని చేతులు దులుపుకునే అవకాశం ఉందని అన్నారు.

అంతేకాదు కొంతమంది టీఆర్ఎస్ మంత్రులు ఇటీవల చేసిన ప్రకటనలు ఇందుకు దారితీసే విధంగా కనుబడుతున్నాయని,
దళితుల 3 ఎకరాల భూమి తుంగలోనే తొక్కినట్టే ఇవి కూడా జరగవచ్చని, కానీ తెలంగాణ సమాజం తిరుగుబాటుకు సిద్ధమయ్యిందని, పరిణామాలు త్రీవంగా ఉండబోతున్నాయని ఈ పరిపాలకులు అర్థం చేసుకోకపోవడం వారి మూర్ఖత్వం అని అన్నారు. మీరు కొనుగోలు కేంద్రాలు తీస్తే రైతులు మీ తోళ్ళు, గోళ్ళూ తీసే పరిస్థితులు ఉంటాయేమో విశ్లేంచుకోవాలని సూచించారు.