అమ్మా.. మీరెక్కడో రాజకుమార్తెగా మళ్ళీ జన్మించే ఉంటారు – విజయశాంతి

Wednesday, February 24th, 2021, 11:31:33 PM IST


తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జన్మదినం సందర్భంగా ఆమెతో తనకు అనుబంధాన్ని బీజేపీ నాయకురాలు విజయశాంతి గుర్తు చేసుకున్నారు. ఆమె స్నేహం, ఆప్యాయత, అభిమానం, తనకు జీవితకాలపు కానుకలని జయలలితతో తీసుకున్న ఒక చిత్రాన్ని విజయశాంతి ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. అమ్మా.. మీరెక్కడో రాజకుమార్తెగా మళ్ళీ జన్మించే ఉంటారని, అయినప్పటికీ మాకందరికీ తెలిసిన రోజుగా మీకివే పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు పంచిన స్నేహం, అభిమానం, ఆప్యాయత నాకు జీవితకాలపు కానుకలుగా, తీపి గుర్తులుగా ఎప్పటికీ అలాగే ఉంటాయని అన్నారు.

అయితే మత తీవ్రవాదుల హిట్ లిస్టులో నేను టార్గెట్ అయినప్పుడు కొన్ని సంవత్సరాల పాటు మీరు నా భద్రత కోసం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ.. ఇంకా.. పురట్చి తలైవియిన్ అన్బు తంగై (విప్లవ నాయకి జయలలితకు ప్రియమైన చెల్లెలు).. ప్రచార బీరంగి (ప్రచారంలో ఫిరంగి) అంటూ మీరు నాకిచ్చిన గౌరవప్రదమైన పిలుపులు ఈ జన్మంతా జ్ఞాపకాలుగా ఎప్పటికీ మిగిలే ఉంటాయని అన్నారు.