బీజేపీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న రాములమ్మ.. డేట్ ఫిక్స్..!

Wednesday, October 28th, 2020, 03:01:33 AM IST


తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు, రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న రాములమ్మ తిరిగి సొంత గూటికి మారే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం హాట్‌టాఫిక్‌గా ఉన్న దుబ్బాక ఉప ఎన్నికవైపు అసలు ఆమె కన్నెత్తి కూడా చూడలేదు.

అంతేకాదు కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా కాంగ్రెస్‌కు ఓటు వేయమని ఆమె పిలుపునివ్వలేదు. దీంతో ఆమె బీజేపీలో చేరేందుకు సిద్దమైందని అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. అయితే వీటన్నిటికి మరింత ఆద్యంపోసే విధంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నేడు విజయశాంతిని కలిసి అరగంట పాటు చర్చించడం హాట్‌టాఫిక్‌గా మారింది. ఇదిలా ఉంటే కొద్ది రోజుల కిందట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా విజయశాంతితో భేటీ అయినట్టు సమాచారం. అయితే నవంబర్ 10 లోపు ముహూర్తం చూసుకుని ఢిల్లీ పెద్దల సమక్షంలో విజయశాంతి మళ్ళీ కమలం గూటికి చేరనున్నట్టు సమాచారం.