కాశీబుగ్గ ఎస్‌ఐ కొత్తూరు శిరీషకు అభినందనలు తెలిపిన రాములమ్మ..!

Friday, February 5th, 2021, 02:16:52 AM IST


శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సబ్ ఇన్‌స్పెక్టర్ కొత్తూరు శిరీష ఇటీవల పలాస మండలం అడవి కొత్తూరు వద్ద గుర్తు తెలియని అనాధ శవాన్ని పొలాల గట్లపై దాదాపు కిలో మీటర్ మేర తన భుజాలపై మోసుకెళ్ళి దహన సంస్కారాలకు అప్పచెప్పారు. విధి నిర్వహణలోనే కాదు సేవ కార్యక్రమంలో వెనుకడుగు వేయని శిరీషపై పెద్ద ఎత్తున ప్రశంసలు వినిపించాయి. అయితే తాజాగా బీజేపీ నాయకురాలు విజయశాంతి కూడా ట్విట్టర్ వేదికగా శిరీషపై ప్రశంసలు కురిపించింది.

నేను నటించిన కర్తవ్యం సినిమా ఒక తండ్రికి ప్రేరణనిచ్చి, తన కూతురిని సమాజం మెచ్చే పోలీస్ అధికారిణిగా తీర్చిదిద్దడం నాకెంతో ఆనందం కలిగించిందని, ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని విధి నిర్వహణలో ముందుకు సాగుతున్న కాశీబుగ్గ ఎస్‌ఐ కొత్తూరు శిరీషకు నా అభినందనలు అంటూ విజయశాంతి చెప్పుకొచ్చారు.