సీఎం కేసీఆర్‌పై మరోసారి అల్టీమేట్ కామెంట్స్ చేసిన రాములమ్మ..!

Tuesday, January 26th, 2021, 01:00:28 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. హిందువుల ఓట్లు గుర్తుకొచ్చినప్పుడల్లా యజ్ఞాలు, పూజలు, స్వాములతో మంతనాలలో మునిగి తేలే కేసీఆర్ గారికి గోమాత మాత్రం దైవంగా కనిపించదు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలన్న లక్ష్యంతో నిన్న ఆదివారం హైదరాబాదులోని చార్మినార్ భాగ్యలక్ష్మి మందిరం నుంచి బహదూర్‌పురా మల్లన్న ఆలయం వరకు గో మహాయాత్ర నిర్వహించేందుకు ముందుకు వచ్చిన పలు గో సంరక్షణ సంస్థలకు అనుమతి కూడా ఇవ్వలేదని అన్నారు.

ఇప్పటికే దేశంలోనే గో హత్యలు అత్యధికంగా జరుగుతున్న రాష్ట్రాలలో తెలంగాణ ముందుందని, తెలంగాణలో అక్రమంగా వున్న కబేళాలను మూసివేయించాలని ఎన్ని విజ్ఞప్తులు పెట్టుకున్నా తెలంగాణ సర్కారు పట్టించుకున్న పాపాన పోలేదని విజయశాంతి ఆరోపించారు. స్వయంగా హిందువు అయి ఉండి.. హిందుగాళ్ళు బొందుగాళ్ళు అంటూ చిల్లర వ్యాఖ్యలు చేసే కేసీఆర్ నుంచి గోమాత రక్షణను ఆశించడం, ఇసుక నుంచి తైలం పిండే ప్రయత్నం ఒకటే అని విజయశాంతి ఎద్దేవా చేశారు.