కేసీఆర్ దొరగారిని రేపు ఒక్కసారి చూసుకోండ్రి – విజయశాంతి

Saturday, November 28th, 2020, 02:06:34 AM IST


గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఎన్నికల ప్రచార సభలో టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు. ప్రతిపక్షాల విమర్శలను దీటుగా తిప్పి కొట్టేలా రేపు సీఎం కేసీఆర్ ప్రసంగం ఉండబోతుందని టీఆర్ఎస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి నేపధ్యంలో కేసీఆర్ సభపై ట్విట్టర్ ద్వారా విజయశాంతి సెటైర్లు గుప్పించారు.

జీహెచ్ఎంసీ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు సవినయ మనవి ఏమంగా, రేపటి కేసీఆర్ గారి ఎన్నికల ప్రచార బహిరంగ సభ నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి దొరగారిని ఒక్కసారి చూసుకోండ్రని, మల్లా ఇంక ఇప్పట్లో ఎన్నికలు లేకుంటే వారు కనబడేది, వినబడేది అసాధ్యమని అన్నారు. ప్రజలు ఇప్పుడున్న కష్టాలకు సీఎం గారి కామెడీ వాగ్దానాల ద్వారా ఏదో కొంత రిలీఫ్ లభించే అవకాశం ఉండవచ్చు కానీ హామీల అమలు ఎప్పటిలాగే ఏమీ ఉండదని మనందరికీ ఎప్పుడూ తెలిసిన కార్యక్రమమే అని విజయశాంతి అన్నారు.