బీజేపీ కార్యకర్తలు తెగిస్తే జైళ్లు చాలవు.. విజయశాంతి హెచ్చరిక..!

Thursday, February 4th, 2021, 03:04:29 AM IST

టీఆర్ఎస్ సర్కార్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోసారి మండిపడ్డారు. అయోధ్య రామాలయ నిర్మాణం కోసం విరాళాలు సేకరిస్తుంటే దానిపై టీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆమె అన్నారు. వరంగల్‌లో దాడులకు పాల్పడ్డ టీఆర్‌ఎస్‌ నేతలను వదిలిపెట్టి బీజేపీ నేతలను అరెస్ట్ చేసి వేధించడం దుర్మార్గమని బీజేపీ కార్యకర్తలు తెగిస్తే జైళ్లు చాలవన్నారు.

ఇకనైనా టీఆర్‌ఎస్‌ తీరు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని విజయశాంతి హెచ్చరించారు. వరంగల్‌ వెళ్ళి నిరసన తెలపడానికి తాను సిద్ధమని ఆమె ప్రకటించారు. అయోధ్యలో రాముడి ఆలయ నిర్మాణానికి సంబంధించిన విరాళాలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతలు ఆయన ఇంటిపై దాడి చేశారు. అయితే దాడులు చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ టీఆర్ఎస్ నేతలు బీజేపీ కార్యాలయంపై దాడి చేశారు.