ముందు అది చెల్లించండి.. మంత్రి కేటీఆర్‌కు విజయశాంతి కౌంటర్..!

Friday, January 29th, 2021, 01:00:32 AM IST

తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు బీజేపె నాయకురాలు విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. నిరుద్యోగ భృతిపై మంత్రి కేటీఆర్ స్పందించిన తీరును ఆమె తప్పుపట్టారు. నిరుద్యోగుల భృతి పై ఈ రోజు మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ గారు స్పందిస్తూ త్వరలో స్పష్టత వస్తుందని తెలియజేశారు. ముఖ్యమంత్రి లేదా ఆర్థికమంత్రి ప్రకటించకపోయినా.. ప్రస్తుత టీఆరెస్ ప్రభుత్వ పరిస్థితుల దృష్ట్యా ఆ ప్రకటనకు విలువ ఉంటుంది.

అయితే నిరుద్యోగులకిచ్చిన హామీ ప్రకారం ఇప్పటికే ఒకొక్కరికీ సుమారుగా రూ.75 వేలు ఈ ప్రభుత్వం బాకీ ఉన్నట్టు తేలింది. మొదట దానిని చెల్లించి, తర్వాత మిగతా ముచ్చట్లు చెబితే మంచిదని అది విడిచి, ఏదో గారడీ కార్యక్రమం మళ్లా మొదలుపెడితే నిరుద్యోగుల తిరుగుబాటు, ఉద్యమాలను ఎదుర్కునేందుకు తెలంగాణ సర్కారు సిద్ధపడాల్సి రావచ్చు. అయితే దుబ్బాక, జీహెచ్ఎంసీలలో బీజేపీ గెలుపు ఫలితాలతోనే ఇంత కదలిక కనబడుతున్నదంటే, రానున్న నాగార్జున సాగర్ ఉపఎన్నిక, కార్పోరేషన్లు, ఎమ్మెల్సీ ఎన్నికలలో గట్టిగా కర్రు కాల్చి ఈ కారు సర్కారుకు ఇంకొంత వాత పెడితే మరికొంత చలనం కలిగే అవకాశం ఉండవచ్చు అని ఎద్దేవా చేసింది.