ఆ సానుభూతి టీఆర్ఎస్‌కు ఎందుకు లభించలేదు – విజయశాంతి

Friday, November 13th, 2020, 06:41:47 PM IST

దుబ్బాకలో బీజేపీ గెలుపుపై సీఎం కేసీఆర్ నిన్న పార్టీ ముఖ్య నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దుబ్బాకలో బీజేపీ విజయంపై ఎక్కువ ఆందోళన అక్కర్లేదని, ఉపఎన్నిక కనుక బీజేపీ అభ్యర్థికి సానుభూతి కలిసొచ్చిందని అన్నారు. రాబొయే జీహెచ్ఎంసీ ఎన్నికలలో సర్వేలన్ని తమకే అనుకూలగా ఉన్నాయని బీజేపీని చూసి పెద్దగా హైరానా పడొద్దని నేతలకు సూచించారు.

అయితే దీనిపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి స్పందిస్తూ జీహెచ్ఎంసీలో గెలుపు మాదేనంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారివన్నీ అవకతవక సర్వేలని, దుబ్బాక ఎన్నికల ముందు కూడా ఇలాగే మాట్లాడారు. దుబ్బాక ఫలితం సానుభూతి తప్ప మరొకటి కాదని సీఎం గారు అన్నారని, ఆ సానుభూతి టీఆర్ఎస్‌కు ఎందుకు లభించలేదో కూడా చెప్పాలని అన్నారు. ఎంఐఎం ఒత్తిడికి తలొగ్గి జీహెచ్ఎంసీ ఎన్నికలు రోజుల్లోనే జరపటానికి నిర్ణయించినట్టు కనబడుతోందని అన్నారు.