మీ పోరాట స్పూర్తి మర్చిపోలేనిదన్నా.. విజయశాంతి ఎమోషనల్ ట్వీట్..!

Friday, October 23rd, 2020, 02:13:42 AM IST


టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి నిన్న రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మలి దశ తెలంగాణ ఉద్యమాలలో చురుకుగా వ్యవహరించిన నాయిని 2001లో టీఆర్‌ఎస్‌లో చేరి తెలంగాణ ఆవిర్భావం వరకు కేసీఆర్ వెంటే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తొలి హోంమంత్రిగా కేసీఆర్ నాయినికి అవకాశం కల్పించారు.

అయితే నాయిని వంటి పోరాట యోధుదు మరణించడంపై సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు, పలువురు ప్రజా ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే తాజాగా నాయిని మృతి పట్ల తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి స్పందిస్తూ మనఃపూర్వక నివాళి తెలియచేసింది. తెలంగాణ ఉద్యమంలో కలసి పనిచేసిన మీపై నాకున్న ఆ గౌరవం ఎప్పటికీ విలువైనదే అంటూ ఆనాడు నేను హాస్పిటల్‌లో ఉన్న సమయంలో డజన్ల సంఖ్యలో పోలీసులు నా ఇంటిని చుట్టుముట్టి… ఉద్యమ సమయంలో కేసుల పేరుతో దాడి చేసినప్పుడు హోరాహోరీగా వారితో బరి గీసి నిలబెట్టి కొట్లాడిన మీ పోరాట స్ఫూర్తి మర్చిపోలేనిదని గుర్తు చేసుకున్నారు.