ప్రజారోగ్యాన్ని సీఎం కేసీఆర్ గాలికి వదిలేశారు – విజయశాంతి

Tuesday, May 18th, 2021, 06:06:06 PM IST


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత, మాజి ఎంపీ విజయశాంతి మరొకసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం లో ప్రజారోగ్యాన్ని సీఎం కేసీఆర్ గాలికి వదిలేశారు అంటూ విమర్శించారు. ప్రైవేట్ హాస్పిటళ్ళలో కోవిడ్ చికిత్స ఫీజుల పై నియంత్రణ లేదని, ఫీజులు కట్టలేక ప్రజలు అల్లాడుతుంటే గడిలో ఉన్న దొరకు కరోనా బాధితుల హాహాకారాలు వినిపించడం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రం లో ఆయుష్మాన్ భారత్ అమలు చేసి ఉంటే కరోనా వైరస్ చికిత్స లో ఐదు లక్షల వరకు కేంద్రమే చెల్లిస్తుంది అని అన్నారు. అయితే ఈ స్కీం లో చేరనందుకు రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయలను కోల్పోయింది అని అన్నారు. అయితే తన బందువులు, అనుచరుల హాస్పిటళ్లకు రోజూ కోట్లల్లో వస్తున్న ఆదాయాన్ని కాపాడేందుకే కేసీఆర్ ఆయుష్మాన్ భారత్ ను, ఆరోగ్య శ్రీ ను అమలు చేయట్లేదా అంటూ సూటిగా ప్రశ్నించారు.

అయితే తెలంగాణ రాష్ట్రం లో ఆయుష్మాన్ భారత్ ను అమలు చేయనందుకు నిరసన గా ఆరోగ్య శ్రీ లో కరోనా ను చేర్చాలన్న డిమాండ్ తో రేపు జరగబోతున్న గరీబోళ్ళ కోసం బీజేపీ దీక్ష ను విజయవంతం చేయండి అంటూ పిలుపు ఇచ్చారు. అయితే తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ సైతం ఆరోగ్య శ్రీ అమలు చేయక పోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరి దీని పై తెరాస నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

https://twitter.com/vijayashanthi_m/status/1394577042906050562?s=19