అవే నిజమైతే టీఆర్ఎస్ ఇప్పటికే ఓట్లు అడగకూడదు – విజయశాంతి

Wednesday, February 10th, 2021, 11:36:37 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోసారి అల్టీమేట్ కామెంట్స్ చేశారు. నేడు నల్గొండ జిల్లా హాలియాలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. దీనిపై రాములమ్మ స్పందిస్తూ ముఖ్యమంత్రిగారు మరోమారు ఎన్నికల ప్రసంగాలు మొదలుపెట్టారని, జీహెచ్ఎంసీ తర్వాత ప్రజలను ఇప్పుడు మరోసారి కలవక తప్పదని, ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ ఎన్నికల దృష్ట్యా అనుకున్నట్టుందని అన్నారు.

అయితే మాట నిలబెట్టుకోకుంటే ఓట్లు అడగం, మాట తప్పితే మెడ నరుక్కుంటా.. అన్నవన్నీ నిజమే అయితే టీఆర్ఎస్ ఇప్పటికే ఓట్లు అడగకూడదని, ఇక కుర్చీ వేసుకుని స్వయంగా కేసీఆర్ గారు చేస్తానన్న అభివృద్ధి ఎంత ఘనం ఉంటదో పక్కనున్న వరంగల్ జిల్లా ప్రజలకు, మిగతా తెలంగాణకు బాగా తెలుసని మరోసారి ఆ మాటలకు ఇంకెవరూ మోసపోవడానికి సిద్ధంగా లేరని హాలియా సభకు హాజరైన ప్రజలు సీఎం గారి ప్రసంగానికి స్పందించక పోవటాన్ని చూస్తేనే ఈ విషయం అర్థం అవుతోందని రాములమ్మ అన్నారు.