తెరాస ప్రభుత్వం పై విజయశాంతి సీరియస్ కామెంట్స్

Thursday, January 28th, 2021, 09:00:16 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై మరొకసారి సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఏళ్ల తరబడి కళ్ళు కాయలు కాసేలా వేచి చూసిన తరువాత వెలువడిన పిఆర్ సి సిఫార్సులను గమనిస్తే ఈ ప్రభుత్వంలో ఎందుకున్నామా అని రోడించే పరిస్థితి కనిపిస్తోంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే గడిచిన 45 ఏళ్లలో అతి తక్కువగా 7.5 శాతం ఫిట్మెంట్ సిఫారసు చేసిన పీఆర్సీ నివేదిక ఉద్యోగుల ఆకాంక్షల పై నిప్పులు పోసింది అంటూ చెప్పుకొచ్చారు. ఉద్యోగులు65 శాతం ఫిట్ మెంట్ ఆశిస్తే సిఫారసు అందులో సగం కూడా లేదు అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అయితే ఈ సీఎం గారు తమకు కమిషన్ రాని ఏ విధమైన ఖర్చునూ ఫిట్ మెంట్ తో సహా దేనికి అంగీకరించరు అంటూ చెప్పుకొచ్చారు.కమిషన్లు దొరికే మోసపు ప్రాజెక్టులకి మాత్రం ఎంతైనా బే ఫికర్ అంటూ విమర్శలు చేశారు.వేల, లక్షల కోట్ల అప్పుల కైనా బరాబర్ తయార్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే సీఎం గారి కాంట్రాక్ట్ కమిషన్ మాత్రం బ్రహ్మాండ మైన స్థాయిలో గతంలోని 10 పర్సెంట్ నుండి 20 పర్సెంట్ కి పెంచుకున్నట్టు వ్యాపార వర్గాలు మాట్లాడుకుంటున్నాయి అని సంచలన ఆరోపణలు చేశారు.