ఏవో మాయమాటలు చెప్పి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు

Monday, February 8th, 2021, 08:56:43 AM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పై ప్రముఖ నటి, బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. ముఖ్యమంత్రి గారి ఆరోగ్యం బ్రహ్మాండం గా ఉందని చెప్పినందుకు సంతోషం అని, వీరి పాలనలో తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక ఆరోగ్యమే ఆందోళన కరంగా తయారైంది అంటూ విజయశాంతి పేర్కొన్నారు. ఈ అధికార పార్టీ దోపిడీల తో సామాన్య ప్రజల జీవన పరిస్థతులే ప్రమాదం లోకి పడిపోతున్నాయి అని అన్నారు. అయితే సీఎం పదవి కి దళిత బిడ్డలను మోసగించి వారసునికి ఎట్లా కట్టబెడతావ్ అని ప్రజలు, బీజేపీ నిలదీస్తున్న భయానికి 10 ఏళ్లు నేనే సీఎం అంటూ ఏవో మాయమాటలు చెప్పి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు అంటూ విమర్శించారు.

అయితే మబ్బుల మాటున ఉండే వాన కాలపు సూర్యుడి లా,మరో పదేళ్ల పాటు ఎప్పుడూ ప్రగతి భవన్ లో కనిపిస్తాడో, ఎప్పుడూ ఫామ్ హౌస్ లో దర్శన మిస్తాడో అర్ధంకాని అయోమయం తో జనం భరించాలని హెచ్చరిస్తున్నట్లు ఉంది అని అన్నారు.