బిగ్ బ్రేకింగ్: యనమల ఫై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి

Friday, January 24th, 2020, 10:38:43 AM IST

శాసన మండలిలో జరిగిన సంఘటన ఫై వైసీపీ నేతలు టీడీపీ ఫై గుర్రుగా వున్నారు. సీఆర్డీఏ మరియు పరిపాలన వికేంద్రీకరణ బిల్లుల్ని నిలుపుదల చేస్తూ సెలెక్ట్ కమిటీకి లేఖ రాయడం పట్ల మండలి చైర్మన్ మరియు టీడీపీ నేతల ఫై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే యనమల రామకృష్ణుడిని ఉద్దేశించి విజయసాయిరెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచే ప్రణాళిక లో భాగంగా యనమల ని స్పీకర్ గా తెరపైకి చంద్రబాబు తీసుకొచ్చాడని అన్నారు. అలా చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి చరిత్రలో నిల్చేంత సేవ చేసారని గుర్తు చేసారు. ఇపుడు యనమల కు వున్న కౌన్సిల్ ఇమేజ్ ని కూడా బాబు తన స్వార్థం కోసం మంట కలిపేశారని అన్నారు.

అయితే గతంలో శాసన మండలికి చైర్మన్ గా వ్యవహరించిన యనమల అక్కడి పరిస్థితిలు, వ్యవహారాలు తెలియడం తో ఆ అనుభవం, పరిజ్ఞానం టీడీపీ నేతలకు చాల ఉపయోగపడిందని చెప్పాలి. అయితే విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు గానూ నెటిజన్లు బిన్నంగా స్పందిస్తున్నారు. బాలకృష్ణ తో వైసీపీ నేతలు ఎగబడి సెల్ఫీలు దిగిన సంఘటన, శుక్రవారం నాంపల్లి కి వెళ్లాల్సిన విషయాల్ని గుర్తు చేస్తున్నారు.