చంద్రబాబుకు, జగన్‌కు తేడా అదే.. విజయసాయి అల్టీమేట్ కామెంట్స్..!

Monday, October 19th, 2020, 06:27:24 PM IST

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు. ఏపీలో 139 బీసీ కులాలకుగాను 56 బీసీ కార్పోరేషన్లను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం దీనికి సంబంధించి 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్, డైరెక్టర్ల పేర్లను కూడా ప్రకటించింది.

అయితే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో వచ్చే డబ్బుని తమ ప్రభుత్వం ముట్టుకోదని సీఎం జగన్ గారు ప్రకటించారని, తి పైసా అక్కడి ప్రజలకే చెందాలని నిర్ణయించారని అన్నారు. సంస్థల సొమ్ముని సొంత ప్రయోజనాలకు దారి మళ్లించిన బాబుకి, సంస్థలని స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేయిస్తున్న జగన్ గారికి ఎంత తేడా అంటూ కామెంట్స్ చేశారు.