జగన్ ముందే కేసీఆర్ కాళ్ళు మొక్కిన విజయసాయి రెడ్డి..!

Monday, January 13th, 2020, 05:13:28 PM IST

ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ప్రఘతి భవన్‌లో భేటీ అయ్యారు. జగన్‌కి పుష్ప గుచ్చం ఇచ్చి సాదరంగ ఆహ్వానించిన సీఎం కేసీఆర్ జగన్‌తో కలిసి భోజనం చేశారు. అయితే పలు రాజకీయ మశాలు, విభజన సమస్యలు, గోదావరి జలాల అంశాలపై చర్చించేందుకు జగన్ కేసీఆర్‌ని కైల్శారు. అయితే ఈ సీఎం జగన్ వెంట ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ఉన్నారు.

అయితే జగన్‌తో మాట్లాడిన సీఎం కేసీఆర్, అనంతరం విజయసాయి రెడ్డిని కూడా పలకరించబోయారు. ఇది గమనించిన విజయసాయి రెడ్డి వెంటనే కేసీఆర్ దగ్గరకు వచ్చి పాదాభివందనం చేసేందుకు ముందుకు వంగారు. అయితే కేసీఆర్ ఆయనను ఆపేందుకు ప్రయత్నించినా కూడా పాదాలను తాకి విజయసాయి రెడ్డి కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే వీరి పక్కనే ఉన్న జగన్, కేటీఆర్ విజయసాయికి పెద్దలపై ఉన్న అభిమానానికి ఫిదా అయ్యారు. ఏదేమైనా ఈ ఒక్క పనితో అటు కేసీఆర్, జగన్ వద్ద విజయసాయి మంచి మార్కులే కొట్టేశారని చెప్పాలి.