ఏది విజన్.. ఏది దుబారా.. చంద్రబాబుకు విజయసాయి సూటి ప్రశ్న..!

Saturday, October 10th, 2020, 01:02:04 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. పోలవరం యాత్రలకు చంద్రబాబు చేసిన ఖర్చు 400 కోట్లు అని, దొంగ దీక్షలకు మరో 300 కోట్లు ఊదేశాడని అన్నారు. కానీ జగన్ గారు 43 లక్షల మంది విద్యార్థులకు బ్యాగు, నోట్ బుక్స్, టెస్ట్ బుక్స్, వర్క్ బుక్స్, బూట్లు, సాక్స్, బెల్ట్ తో కూడిన కిట్ ఇవ్వడానికి చేసిన 650 కోట్లు కర్చు చేశారని ఇప్పుడు చెప్పండి ఏది విజన్? ఏది దుబారా? అంటూ ప్రశ్నించారు.

ఇక ఇది పక్కన పెడితే రాజధాని ఇటుకల కోసం స్కూలు పిల్లల నుంచి వసూలు చేసిన డబ్బు ఏమైంది బాబు గారూ అని, రియల్ ఎస్టేట్ భూముల విలువ పెంచుకునేందుకు పసివాళ్లని కూడా వదల్లేదు కదా అని విమర్శించారు. మీరు వాళ్ల జేబులు ఖాళీ చేస్తే, ఇప్పుడా విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు జగన్ గారు. తేడా తెలుస్తోందా అని ఎద్దేవా చేశారు.