విశ్వాస ఘాతకుడిగా 25 ఏళ్లు.. చంద్రబాబుపై విజయసాయి సెటైర్లు..!

Friday, August 28th, 2020, 10:23:16 AM IST

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. అయితే ట్విట్టర్ ద్వారా చంద్రబాబు మోసాలను ఎండగడుతూ విశ్వాస ఘాతకుడిగా 25 ఏళ్లు పూర్తి చేసుకొని ఆగస్ట్ 25 న “వెన్నుపోటు” దినోత్సవం జరుపుకున్నాడని అన్నారు.

అంతేకాదు ఆగస్ట్ 28 వ తేదిన చంద్రన్న రక్తపాత దినోత్సవం జరుపుకుంటున్నారని, హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో బాబు సృస్టించిన మారణహోమం నేటికి 20 ఏళ్లు పూర్తి చేసుకుందని అన్నారు. నీవు ఎంత క్రూరుడివో, ఎంతటి విధ్వంసకారుడివో చరిత్రే చెబుతుంది బాబు అంటూ మండిపడ్డారు.