ఉత్తుత్తి రాజీనామా.. గంటాపై పరోక్షంగా సెటైర్లు వేసిన విజయసాయి రెడ్డి..!

Monday, March 22nd, 2021, 06:49:40 PM IST

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పరోక్షంగా సెటైర్లు గుప్పించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కొందరు “గంటలు” కట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఉత్తుత్తి రాజీనామాతో సొంత “గంట” మోగిస్తున్నారు. ఆ “గంట”లో రణగొణధ్వనులు తప్ప చిత్తశుద్ధిలేదని, ఆ “గంట” శబ్దాల వెనుకున్న ప్రయోజనాలు అసలు ఉద్యమకారులకు తెలియదా అని ప్రశ్నించారు. అంతేకాదు ఈ గంటే గతంలో విశాఖలో “భూగంట” మోగించలేదా అని అన్నారు.

ఇదిలా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం మరింత పెరిగిపోయింది. అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్ధతు తెలిపిన తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను కలిసిన గంటా ఆయనకు ధన్యవాదాలు తెలియచేసి, ఉద్యమంలో పాల్గొనాలని ఆహ్వానం పలికారు.