వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీపై ట్విట్టర్ వేదికగా మరోసారి మండిపడ్డారు. జగనన్న విద్యాకానుక పేరుతో పేదలపై ఉన్న కడుపుమంటను పచ్చ నేతలు కక్కేస్తున్నారని అన్నారు. పార్టీ రంగులున్నాయని కొందరు, టీడీపీ కూడా ఇచ్చిందని మరికొందరు. హై క్వాలిటీ కిట్ లను అందించడంతో ఇక చేసేదిలేక చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, ఇంకో పాతికేళ్లు ఈ ఏడుపు ఏడుస్తూనే ఉండండని అన్నారు.
అయితే ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించిన ‘జగనన్న విద్యాకానుక’ కార్యక్రమాన్ని ఇటీవల సీఎం జగన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న 42.34 లక్షల మంది విద్యార్ధులకు ఈ కిట్లను పంపిణీ చేయనున్నారు. ఒక్కో కిట్లో 3 జతల యూనిఫాం, జత బూట్లు, 2 జతల సాక్సులు, బెల్టు, పుస్తకాలు, నోట్స్ బుక్స్, బ్యాగ్, మాస్క్ ఉండనున్నాయి.
జగనన్న విద్యాకానుక పేరుతో పేదలపై ఉన్న కడుపుమంటను కక్కేస్తున్నారు పచ్చనేతలు. పార్టీ రంగులున్నాయని కొందరు, టీడీపీ కూడా ఇచ్చిందని మరికొందరు. హై క్వాలిటీ కిట్ లను అందించడంతో ఇక చేసేదిలేక చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ఇంకో పాతికేళ్లు ఈ ఏడుపు ఏడుస్తూనే ఉండండి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 12, 2020