ఇవేమి డ్రామాలు నిమ్మగడ్డా, నారా బాబు.. విజయసాయి సెటైర్లు..!

Saturday, February 6th, 2021, 10:31:42 AM IST

ఏపీలో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ మేనిఫెస్టో రిలీజ్ చేయడాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. పార్టీలకతీతంగా జరిగే పంచాయితీ ఎన్నికలకు పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చెయడం సరికాదని దీనిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్ళింది. అయితే ఎస్ఈసీ మాత్రం కేవలం టీడీపీ మేనిఫెస్టోను రద్దు చేసి ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

అయితే దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. భళా! ఇవేమి డ్రామాలు నిమ్మగడ్డా, నారా బాబు అంటూ నేను కొట్టినట్లు నటిస్తా – నువ్వు ఏడ్చినట్లు నటించు అన్నట్లుంది మీ యవ్వారం అని అన్నాడు. టీడీపీ చెప్పిన సమాధానం సంతృప్తిగా లేకపోతే చర్యలు తీసుకోవాలి కానీ టీడీపీ మ్యానిఫెస్టోను నువ్వు రద్దు చేయడమేంటయ్యా నిమ్ము అని ప్రశ్నించారు.