టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్ గురించి శోకాలు తప్ప ప్రజల కోసం ఏనాడైనా నోరు విప్పారా బాబూ అని ప్రశ్నించారు. ఎప్పుడో ఒకసారి సందర్శకుల్లా వచ్చి రెచ్చగొట్టే స్పీచులు దంచిపోవడమే ప్రజా సేవ అనుకుంటే ఎలా అని జీతభత్యాలు తీసుకుంటున్నందుకైనా రాష్ట్రానికి పనికొచ్చే సలహాలు ఇవ్వండని అన్నారు.
అంతేకాదు ఓటుకు నోటు కేసులో అరెస్టు భయంతోనే కరకట్టకు పారిపోయి వచ్చాడని గుసగుసలు ఉన్నాయని, ‘మన వాళ్లు బ్రీఫుడ్ మీ’ అనే వాయిస్ తనదేనని ఫోరెన్సిక్ ల్యాబులు తేల్చాయని చెప్పుకొచ్చారు. సాక్ష్యాలు పక్కాగా ఉన్నాయంట అంటూ ‘వెయ్యి గొడ్లను పీక్కుతిన్న రాబందు’ సామెత ఇలాంటి వారి కోసమే పుట్టి ఉంటుందని ఎద్దేవా చేశారు.
అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్ గురించి శోకాలు తప్ప ప్రజల కోసం ఏనాడైనా నోరు విప్పారా బాబూ! ఎప్పుడో ఒకసారి సందర్శకుల్లా వచ్చి రెచ్చగొట్టే స్పీచులు దంచిపోవడమే ప్రజా సేవ అనుకుంటే ఎలా? జీతభత్యాలు తీసుకుంటున్నందుకైనా రాష్ట్రానికి పనికొచ్చే సలహాలు ఇవ్వండి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 13, 2020
ఓటుకు నోటు కేసులో అరెస్టు భయంతోనే కరకట్టకు పారిపోయి వచ్చాడని గుసగుసలు. ‘మన వాళ్లు బ్రీఫుడ్ మీ’ అనే వాయిస్ తనదేనని ఫోరెన్సిక్ ల్యాబులు తేల్చాయి. సాక్ష్యాలు పక్కాగా ఉన్నాయంట. ‘వెయ్యి గొడ్లను పీక్కుతిన్న రాబందు’ సామెత ఇలాంటి వారి కోసమే పుట్టి ఉంటుంది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 13, 2020