ఎన్నిసార్లు మారతారు.. చంద్రబాబుపై విజయసాయి సెటైర్లు..!

Thursday, January 14th, 2021, 07:48:36 PM IST

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. మొన్న ఎన్నికలలో ఎందుకు ఓడిపోయారనే విషయం ఇంకా తెలియడం లేదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. సంక్రాంతి సృష్టికర్తనని చెప్పుకునే బాబు గరికి చిత్తుగా ఓడిపోయి రెండేళ్లవుతున్నా ఎలా ఓడిపోయాడో తెలియదంట అంటూ ఎద్దేవా చేశారు.

అంతేకాదు పైగా సారీ-పూర్తిగా మారిపోయానంటూ కొత్త డ్రామాలు మొదలెట్టారని, ఎన్నిసార్లు మారతారు బాబు గారూ అని ప్రశ్నించారు. దేవాలయాలు ధ్వంసం చేస్తూ తన ఓటమికి ఇంకా ప్రజల్నే నిందిస్తున్నాడని అన్నారు. అలాగే రైతుల కోసం తెచ్చిన జీవోను చంద్రబాబునాయుడు, టీడీపీ నేతలు బోగి మంటల్లో వేయడాన్ని తప్పుపట్టిన విజయసాయి రెడ్డి అమూల్ రాకతో వరి పండించే రైతులే కాదు పాడి రైతులు కూడా అదనపు ఆదాయంతో ఆనందంగా ఉన్నారని, మరి రాష్ట్రం ఇచ్చిన జీవోలను భోగిమంటల్లో వేయమంటారేంటి చంద్రబాబు గారూ? హెరిటేజ్ కంపెనీ ఆదాయం తగ్గినా లక్షలాది రైతులకు లాభం జరిగిందిగా! రైతు బాగుపడితే మీకు అంత కడుపుమంట ఎందుకు అని నిలదీశారు.