దీన్నే అధికార దోపిడీ అంటారు.. చంద్రబాబుపై విజయసాయి సెటైర్లు..!

Saturday, December 12th, 2020, 12:30:45 AM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరో సారి సెటైర్లు గుప్పించారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే హెరిటేజ్ కు ఏటా వందల కోట్లు లాభాలొచ్చేస్తాయని, నాలుగేళ్ల మనవడి పేరున కూడా కోట్ల రూపాయల ఆస్తులు చూపిస్తాడని అన్నారు. అయితే అధికారం పోగానే నష్టాలంటూ హెరిటేజ్ వాటాలు అమ్మేస్తాడని దీన్నే “అధికారిక దోపిడీ” అంటారు బాబుగారూ అని అన్నారు. అయితే ఇందుకేనా అమూల్ పై అసెంబ్లీలో చర్చిద్దామంటే పారిపోయావ్ అని ప్రశ్నించారు.

ఇక అంతకు ముందు కుంభకోణాల పుట్ట అమరావతిలో బాబు నిర్మించిన తాత్కాలిక సచివాలయానికి వెయ్యి కోట్లకు పైగా ఖర్చయిందట అని అన్నారు. ‘టెంపరరీ’ అంటూనే చ.అడుగుకు రూ.3,500 దోచిపెట్టాడని, నూతన పార్లమెంటు భవనానికి కేంద్రం కేటాయించింది 971 కోట్లే అని అడ్డగోలుగా స్కాంలకు పాల్పడి నిప్పు, తుప్పు అనడం బాబుకే చెల్లిందని ఎద్దేవా చేశారు.