కరోనాను చంద్రబాబు ఎలా ఎదుర్కోగలిగాడో మీకు తెలుసా?

Monday, November 9th, 2020, 10:51:18 AM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ ద్వారా ప్రతి రోజు సెటైర్లు కురిపిస్తూనే ఉన్నారు. అయితే నేడు కూడా విజయసాయి ట్విట్టర్‌లో చంద్రబాబుపై సెటైరికల్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు కరోనాను ఎలా ఎదురుకున్నాడో మీకు తెలుసా అంటూ క్వశన్ చేస్తూ అందుకు కింద నాలుగు ఫన్నీ ఆప్షన్లు కూడా ఇచ్చాడు. అందులో మొదటిది 8 నెలలుగా ఇంట్లో దాక్కోవడం ద్వారా అంటూ, రెండవది తాను కనిపించకపోయినా బాబు వెన్నుపోటు పొడుస్తాడని కరోనా భయపడడం వల్ల అంటూ, మూడవది కరోనాయే ఛీకొట్టి సామాజిక దూరం పాటించడం వల్ల, నాల్గవది లోకేష్‌ అనే మహావీరుడి వల్ల అని అడుగుతూ ట్వీట్ చేశాడు.