చంద్రబాబుకు పోటాపోటీగా ట్రంప్, బైడెన్ ఫోన్లు.. విజయసాయి సెటైర్లు..!

Thursday, November 5th, 2020, 03:00:14 AM IST


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి సెటైర్లు గుప్పించారు. అమెరికాలో జో బైడెన్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ల మధ్య జరుగుతున్న అద్యక్ష రేసును ప్రస్తావిస్తూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్‌లో ఇప్పటివరకు బైడెన్‌ 238 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించగా, ట్రంప్‌ 213 ఓట్లు సాధించారు. ఇంకా కొన్ని రాష్ట్రాలలో కౌంటింగ్ కొనసాగుతుండడంతో అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ ప్రపంచ దేశాల్లో ఆసక్తి రేపుతుంది.

అయితే ట్రంప్ మీడియా ముందు మాట్లాడుతూ తమ గెలుపు లాంఛనం అంటూనే ఓట్ల లెక్కింపు ఆపాలని లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వ్యాఖ్యలు చేశారు. అయితే ట్రంప్ సుప్రీంను ఆశ్రయిస్తే తమ న్యాయవాద బృందాలు కూడా సిద్దంగా ఉన్నాయని జో బైడెన్ బృందం తెలిపింది. అయితే ట్రంప్, బైడెన్ మధ్య జరిగిన ఈ మాటల యుద్ధాన్ని ప్రస్తావించిన విజయసాయి రెడ్డి ఓ బ్రేకింగ్ న్యూస్ అంటూ చంద్రబాబుకు పోటాపోటీగా ట్రంప్, బైడెన్‌ ఫోన్లు చేస్తున్నారని, తమ ఎన్నికల కమిషన్‌ను, సుప్రీంకోర్టును ఎలా మేనేజ్‌ చేయాలనే అంశంపై సంప్రతింపులు జరుపుతున్నారని ఎద్దేవా చేశారు.