ఆ సరదా కూడా తీర్చుకుందురు.. చంద్రబాబుపై విజయసాయి సెటైర్లు..!

Saturday, December 12th, 2020, 11:00:14 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా సెటైర్లు గుప్పించారు. ఘంఛ్ ఎన్నికలలో ‘ఇరగదీసిన’ తర్వాత తిరుపతి గెలుపు కోసం సిద్ధంగా ఉండాలని బాబు కార్యకర్తలకు కనుసైగ చేస్తున్నారని, ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి దూరమయ్యారట. మానసిక రుగ్మతల వల్ల మీరు భ్రమల్లో ఉన్నా జనం మాత్రం పిచ్చ క్లారిటీతో ఉన్నారు. తొందరెందుకు ఆ సరదా కూడా తీర్చుకుందురు అంటూ ఎద్దేవా చేశారు.

అయితే ఇటీవల కరోనా బారిన పడి తిరుపతి వైసీపీ ఎంపీ దుర్గాప్రసాద్ మృతిచెందడంతో ఆ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగబోతుంది. అయితే ఇప్పటికే టీడీపీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ పేరును ప్రకటించగా, వైసీపీ అభ్యర్థిగా గురుమూర్తి పేరును ప్రకటించారు. ఇక బీజేపీ, జనసేన పొత్తుగా ముందుకెళ్తుండడంతో ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.