ప్రజల ప్రాణాలకు విలువే లేదా.. చంద్రబాబుపై మండిపడ్డ విజయసాయి రెడ్డి..!

Saturday, January 23rd, 2021, 10:42:22 PM IST

ఏపీలో పంచాయితీ ఎన్నికల వార్ నడుస్తుంది. ఓ పక్క ప్రభుత్వం, ఉద్యోగులు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దంగా లేమని చెబుతుంటే, ఎస్ఈసీ నిమ్మగడ్డ మాత్రం ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సిందే అని తొలివిడత నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. అయితే దీనిపై స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై మండిపడ్డారు. ఘంఛ్ ఎలక్షన్లలో అభ్యర్థులను నిలబెట్టి కూడా కరోనా భయానికి తండ్రీ కొడుకులిద్దరూ ప్రచారానికి వెళ్లలేదని, పంచాయతీ ఎన్నికల్లో మీ కంటే పెద్దవాళ్లు క్యూలో నిల్చుని ఓట్లు వేయాలని నిమ్మగడ్డతో చెప్పిస్తున్నారే. ప్రజల ప్రాణాలకు విలువే లేదా అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.

ఇక అంతకు ముందు రాజకీయ అవసాన దశలో సభ్యత, సంస్కారపు వస్త్రాల్ని విడిచి పారేసి చంద్రబాబు ‘నగ్నంగా’ చెలరేగిపోతున్నాడని విజయసాయి రెడ్డి అన్నారు. కళ్లు, చెవులు మూసుకొని అయ్యో అనడం మినహా చేయగలిగేది ఏమీ లేదు. ప్రజలైతే ఎప్పుడో తుపుక్కుమని ఊమ్మేసి బాబును పట్టించుకోవడం కూడా మానేశారని, రాబోయే రోజుల్లో ఇంకెన్ని వికృత చేష్టలు చూపిస్తాడో అంటూ విమర్శలు గుప్పించారు.