మీరు చేసిన పాపాలు కడుక్కోవడానికే ఇంకో దశాబ్దం పడుతుంది – విజయసాయి రెడ్డి

Friday, February 5th, 2021, 01:01:54 AM IST


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు అమిత్ షాపై తిరుపతి పుణ్యక్షేత్రంలో రాళ్ళు వేశారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రామతీర్థంలో రాళ్లు వేసి తర్వాత చీకట్లో కాళ్లు పట్టుకోవడంలో పచ్చనేతలకు సాటెవరని ప్రశ్నించారు. మీరు చేసిన పాపాలు కడుక్కోవడానికే ఇంకో దశాబ్దం పడుతుంది బాబూ గారు అంటూ మండిపడ్డారు.

అయితే అంతకు ముందు ఎస్ఈసీ నిమ్మగడ్డ పంచాయితీ ఎన్నికల కోసం చేయించిన ఈ-వాచ్ యాప్‌పై కూడా విజయసాయి ఆరోపణలు చేశాడు. ప్రభుత్వం అజమాయిషీలో ఉండాల్సిన నిఘా వ్యవస్థను పచ్చ కంపెనీ చేతుల్లో పెట్టాడని, ఆ గ్యాంగ్ ఓకే అన్నాకే కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు వెళ్లేలా ఏర్పాట్లు చేశాడని ఎన్టీఆర్‌ భవన్‌లోనే యాప్ చేయించామని చెప్పడానికి భయమెందుకు నిమ్మగడ్డా అని ప్రశ్నించారు. అంతేకాదు రాజ్యాంగ పదవి ముసుగులో ప్రజలతో ఈ ఆటలెందుకు? ముసుగు తీసేయ్ అని సూచించారు.