పేదలంటే అంత చులకన.. చంద్రబాబుపై విజయసాయి రెడ్డి కామెంట్స్ ..!

Friday, November 20th, 2020, 05:56:51 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి మండిపడ్డారు. టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులు రూ. 7 లక్షలు వాయిదా పద్ధతిలో 20 ఏళ్లు చెల్లించాలని టీడీపీ చెప్పిందని, రుణభారంతో జీవితాంతం తన కాళ్ల కింద బానిసలుగా నలిగిపోవాలనేది బాబు గారి స్కెచ్ అని అన్నారు. పేదలంటే చంద్రబాబుకు ఎంతో చులకనో దీనిని బట్టే అర్ధమవుతుందని అన్నారు. అయితే సీఎం జగన్ మాత్రన్ రూపాయికే ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించారని చెప్పుకొచ్చారు. సొంత ఇల్లు అనేది ప్రతి పౌరుడి హక్కు, ఆత్మగౌరవ చిహ్నమని విజయసాయి అన్నారు.