ఇప్పుడు చంద్రబాబు ఎలా ఉన్నాడో ఇవి చూస్తే తెలిసిపోతుందట.!

Sunday, August 2nd, 2020, 02:05:51 PM IST

ఇప్పుడు ఏపీలో మూడు రాజధానుల అంశం పెద్ద ఎత్తున దుమారం రేపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మూడు రాజధానులు వద్దు ఒకే ఒక్క రాజధానిగా ఏపీ ఒక్కటే కొనసాగాలని టీడీపీ పార్టీ మరియు ఇతర పార్టీలు అలాగే ఏది ఏమైనప్పటికీ మూడు రాజధానులు చేసి తీరుతామని వైసీపీ శ్రేణులు ఎవరికి వారు వెనుకడుగు వెయ్యడం లేదు.

అయితే వీరి పోరులో సంఖ్యా బలం ప్రకారం వైసీపీకే ఎక్కువ మద్దతు ఉండడంతో వీరు అనుకున్నవే జరిగేందుకు ఆస్కారం ఉంది. ఇక ఇటీవలే కరోనా నుంచి బయపడిన వైసీపీ కీలక నేత వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి తన తన సైరా పంచెస్ చంద్రబాబుపై కురిపిస్తున్నారు. మూడు రాజధానుల అంశం ఖచ్చితంగా బాబు అండ్ కో కు గట్టి దెబ్బే అని అందరికీ తెలిసిందే.

దానిపై మరింత కారం జల్లుతూ ఓ సంచలన ట్వీట్ ను విజయసాయి రెడ్డి పెట్టారు. “రాజధాని విషయంలో చంద్రబాబు నవ్వుతున్నాడో.. మొహం కంద గడ్డలా పెట్టుకున్నాడో.. కుట్రపూరిత ఆలోచనలో ఉన్నాడో..లేదా ఏడుస్తున్నాడో.. తెలుసుకోవాలంటే మనం ఆయన మొహం చూడనక్కర్లేదు. ఎల్లో మీడియాలో వార్తలు, వ్యాఖ్యలు చూస్తే సరిపోతుంది.” అంటూ మరోసారి గాలి తీసినంత పని చేసారు. మరి ఈ వ్యవహారం ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.