వారే ఆ విగ్రహాన్ని కూడా కూలగొట్టారేమో.. విజయసాయి సంచలన వ్యాఖ్యలు..!

Tuesday, January 5th, 2021, 03:00:37 AM IST


ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులపై, ముఖ్యంగా రామతీర్ధం ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందిచిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి దేవాలయాలపై జరుగుతున్న దాడులకు టీడీపీనే కారణమని మరోసారి చెప్పుకొచ్చారు. విజయవాడ బస్టాండ్ దగ్గర సీతమ్మవారి మట్టి విగ్రహం పగలిపోవడం దురదృష్టకరమని, ఆ విషయం గుడి తలుపులు తీశాక లోకానికి తెలిసిందని అన్నారు.

అయితే గుడి తాళం తెరవక ముందే అక్కడికి పచ్చ నేతలు, పచ్చ మీడియా ఎలా వెళ్లారబ్బా అని ప్రశ్నించారు. రామతీర్థం శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేసినవారే సీతమ్మవారి విగ్రహాన్నీ కూలగొట్టారా అని సందేహం వ్యక్తం చేశారు. ఇక అంతకు ముందు చంద్రబాబుపై మండిపడుతూ ముక్కోటి దేవతలు కొలువుదీరిన పుణ్య భూమి ఇది అని, అమరావతిలో మాత్రమే దేవతలు తిరగరని, మీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయని దైవత్వాన్ని ఆపాదించవద్దు. దళిత వాడల్లో, కుగ్రామాల్లో, చెట్టు చేమల్లో, సృష్టిలోని ప్రతి జీవిలో దైవం ఉంటాడు. చూడటం నేర్చుకోండి బాబూ అని ఎద్దేవా చేశాడు.