బాబు శాసిస్తాడు, నిమ్మగడ్డ పాటిస్తాడు.. విజయసాయి సెటైరికల్ కామెంట్స్..!

Tuesday, February 9th, 2021, 02:29:24 AM IST


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌లపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైరికల్ కామెంట్స్ చేశారు. బాబు శాసిస్తాడు. నిమ్మగడ్డ పాటిస్తాడని, న్యాయస్థానం ఛీవాట్లు పెట్టి, మొట్టికాయలు వేసినా పట్టించుకోడని, ప్రజలు నవ్వుకుంటున్నారన్న బిడియం కూడా లేకుండా రేయింబవళ్లు చంద్రబాబు సేవలో నిమ్మగడ్డ రమేశ్ తలమునకలు అవుతున్నాడని అన్నారు.

ఇదే కాకుండా ఎన్నికలలో డబ్బులు పంచడం మా ఇంటా వంటా లేదని పత్తి గింజలా మాట్లాడతావు గదా బాబూ! ఇప్పుడు కోడెల శివరాం కేసుతో మీ రాజకీయం, ఓటర్లను ప్రలోభ పెట్టిన వైనం వందోసారి బయటపడిందని, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేసి ఓట్లడుగుతారు ఎవరైనా. మీరు మాత్రం మందును వరదలా పారిస్తారని అన్నారు. ఇక ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి నిమ్మగడ్డ వెళ్ళాడని అయితే ఆ ఆసుపత్రిని ఆనుకునే టీడీపీ ఆఫీస్ ఉందని ఈ రెండిటికి సంబంధం ఉందా అని జనం అంటున్నారని అన్నారు. కంటికి ఇన్ఫెక్షన్ ఉంటే బాగవుతుంది. కానీ చూసే విధానమే బాగులేకపోతే ఎలా అని అందుకే ఎర్రగడ్డలోనే చూపించుకోవాలని సలహా ఇచ్చారు.