రోజు రోజుకు జోకర్‌లా మారుతున్నారు.. చంద్రబాబుపై విజయసాయి సెటైర్లు..!

Monday, August 31st, 2020, 11:20:28 AM IST

Vijayasai_Chandrababu

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై విజయసాయి రెడ్డి సెటైర్లు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆరోపిస్తున్నారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే రెండు శిరోముండనం ఘటనలు జరిగాయంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో, వైసీపీ పాలన ఎలా ఉందో చెప్పనక్కర్లేదని ఆయన ఆరోపణలు చేస్తున్నారు.

అయితే చంద్రబాబు ఆరోపణలపై స్పందించిన విజయసాయి రెడ్డి వీధిలో జరిగే గొడవలన్నింటిని ప్రభుత్వానికి అంటగడుతున్నారని, చివరికి ఇంట్లో జరిగిన సంఘటనకి కూడా ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని అన్నారు. మీ మానసిక స్థితిపై ప్రజలకు అనుమానంగా ఉందని, జనాలు నవ్వుకుంటున్నారని అన్నారు. రోజు రోజుకి మరీ జోకర్‌లా ఎందుకు మారుతున్నారని ప్రశ్నించారు.