చంద్రబాబుది శాడిస్టిక్ మెంటాలిటీ.. విజయసాయి రెడ్డి సెటైర్లు..!

Sunday, December 20th, 2020, 03:00:57 AM IST

టీడీపీ ఎమ్మెల్యే వెలగపుడి రామకృష్ణ కార్యాలయం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ ఆఫీసర్‌పై వైసీపీ రౌడీలు దాడి చేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా తప్పుపట్టారు. ఏపీలో పోలీసులకు కూడా రక్షణ కరువయ్యందంటూ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై స్పందించిన ఏపీ పోలీసు శాఖ చంద్రబాబు చేసిన పోస్ట్ సరైనది కాదని వైకాపా కార్యకర్తలు కిందపడిపోయిన పోలీసును లేపి సాయం అందించారని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయవద్దని చంద్రబాబుకు సూచించింది.

అయితే దీనిపై స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబుపై సెటైర్లు వేశారు. ప్రమాదవశాత్తు కింద పడిన పోలీసు అధికారిని లేపి సాయపడుతున్న యువకుడిని అతనిపై దాడి చేస్తున్న గూండాగా అభివర్ణించడం మతి భ్రమించిన చంద్రబాబుకే సాధ్యమని అన్నారు. బురద జల్లేస్తే వాళ్లే తుడుచుకోలేక చస్తారు అనే శాడిస్టిక్ మెంటాలిటీ చంద్రబాబుదని ఎద్దేవా చేశారు.