పచ్చ కండువా కప్పి కాపాడాడు.. చంద్రబాబుపై విజయసాయి కామెంట్స్..!

Tuesday, September 8th, 2020, 03:45:50 PM IST

ఏపీ తూర్పుగోదావరి జిల్లాలోని సుప్రసిద్ధ అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయం యొక్క రథానికి నిప్పు అంటుకుని కాలి బూడవ్వడం తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపుతుంది. అయితే ఇది కావాలని చేశారా, లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆలయ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని భక్తులు, హిందూ సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఈ ఘటనపై ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిజనిర్ధారణ కమిటీ వేశారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అందర్వేది ఆలయ రథం దగ్ధంపై గంటల వ్యవధిలోనే చంద్రబాబు గారు నిజనిర్ధారణ కమిటీ వేశారని, స్వర్ణ ప్యాలేస్ అగ్నిప్రమాదంలో పది మంది అమాయకులు ప్రాణాలు కోల్పేతే కనీసం నోరు కూడా మెదపలేదెందుకని ప్రజలు అడుగుతున్నారని అన్నారు. రమేశ్ హాస్పిటల్స్ పై ఈగ కూడా వాలకుండా పచ్చ కండువా కప్పి కాపాడాడని కామెంట్స్ చేశారు.