ఫేక్’ అనే పదానికి ప్యాంటు, షర్టు తొడిగితే చంద్రబాబే – విజయసాయి రెడ్డి

Friday, December 4th, 2020, 01:00:19 AM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి సెటైర్లు గుప్పించారు. అసెంబ్లీ సమావేశాలలో జగన్‌ను ఫేక్ సీఎం అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు విజయసాయి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఫేక్ అనే పదానికి ప్యాంటు, షర్టు, ముక్కుకు మాస్కు, చేతులకు గ్లోవ్స్ తొడిగితే అది చంద్రబాబే అని ఎద్దేవా చేశారు. ప్రజలు నీరాజనం పడుతున్న యువ ముఖ్యమంత్రిపై నోటికొచ్చినట్టు కామెంట్లు చేస్తూ జనంలో చంద్రబాబు నాయుడు మరింత పల్చనవుతున్నాడని, చేయనిది చేసినట్టుగా భ్రాంతి కల్పించే చంద్రబాబుకి రాజకీయంగా ఇదే ఆఖరి టెర్మ్ అని చెప్పుకొచ్చారు.