మొత్తానికి కరోనాను జయించిన వీసా రెడ్డి..మొదటి ట్వీట్ ఇదే.!

Saturday, August 1st, 2020, 01:19:37 PM IST

కరోనాకు కాదు ఎవరూ అతీతం అన్నట్టుగా ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సహా ప్రజా నాయకులకు కూడా కరోనా రావడం షాకింగ్ అంశంగా మాత్రం హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఆంధ్ర రాష్ట్ర అధికార పార్టీ వైసీపీకు చెందిన నేతలు కూడా కరోనా బారిన పడ్డారు.

వారిలో ముఖ్యలు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరియు మరొకరు అంబటి రాంబాబు. వీరిలో అంబటి రాంబాబు మొన్నటితో కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నానని ట్విట్టర్ లో తన అధికారిక ఖాతా ద్వారా తెలిపి కన్ఫర్మ్ చేసారు. అలాగే విజయసాయి రెడ్డి కూడా కరోనాను జయించి దేవుని ఆశీస్సుల వల్ల ఆరోగ్యంతో బయటపడ్డానని ఆయన తెలిపారు.

అలా తెలుపుతూ చాలా రోజులకు తన మొదటి ట్వీట్ పెట్టారు. “భగవంతుడి దయతో, శ్రేయోభిలాషుల ప్రార్థనల బలంతో కోలుకున్నాను.అందరికీ కృతజ్ఞుడిని.మానవాళి అస్థిత్వానికి సవాలుగా మారిన కరోనాను ప్రతి ఒక్కరూ జయించాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను.” అని తెలిపి ట్వీట్ చేసారు. దీనితో వైసీపీ శ్రేణుల్లో మళ్ళీ ఉత్సాహం నెలకొంది.