ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయి..!

Monday, February 8th, 2021, 07:09:51 PM IST

ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్‌పై రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల చేసిన ఆరోపణలను రికార్డుల నుంచి తొలగించాలంటూ విజయసాయిరెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తారు. అయితే విజయసాయి లేవనెత్తిన పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను వెంకయ్యనాయుడు తోసిపుచ్చారు. దీనికి నిరసనగా వైసీపీ ఎంపీలు వెల్‌లోకి వచ్చారు.

కనకమేడల వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడుపై విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు. కనకమేడల వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించకపోవడం దురదృష్టకరమన్నారు. మీ మనసు బీజేపీతో, తనువు టీడీపీతో ఉన్నాయంటూ వెంకయ్యనాయుడిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే విజయసాయి వ్యాఖ్యలకు వెంకయ్యనాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతి పదవికి ప్రతిపాదన వచ్చిన వెంటనే పార్టీకి రాజీనామా చేశానని, అప్పటి నుంచి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు తాను దేశ ప్రజలతో మమేకమై ఉన్నానని, వ్యక్తిగతంగా విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని అన్నారు.