టీడీపీ 60 నెలల్లో చేయలేని పని వైసీపీ 20 నెలల్లో చేసి చూపించింది – విజయసాయి

Friday, February 12th, 2021, 11:54:58 PM IST

Ycp-mp-Vijayasai-reddy
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రతిపక్ష టీడీపీపై మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. టీడీపీ 60 నెలల్లో చేయలేని పనిని వైసీపీ 20 నెలల్లో చేసి చూపించిందని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం పరుగులు పెడుతోందని, 52 మీటర్ల ఎత్తులో స్పిల్‌వే బ్రిడ్జి పనులు పూర్తయ్యాయని అన్నారు. 2022 ఖరీఫ్‌లోగా సాగునీరు అందివ్వడమే లక్ష్యమని అన్నారు. రివర్స్ టెండరింగ్, నిరంతరం పర్యవేక్షణ వల్లే ఇది సాధ్యమైందని విజయసాయి అన్నారు.

ఇక అంతకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబుపై కూడా విజయసాయి సెటైరికల్ కామెంట్స్ చేశారు. పచ్చ తమ్ముళ్లకు బాబు ఆరోగ్యంపై ఏమాత్రం శ్రద్ధలేదని, ఆయన అప్పర్ కంపార్ట్‌మెంట్‌ ఎప్పుడో పోయిందని పంచాయతీ ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలంటూ కేంద్ర హోంమంత్రికి లేఖలు రాస్తున్నాడంటే పిచ్చి ఎంతగా ముదిరిందో అర్థం చేసుకోవచ్చని, గొలుసులతో కట్టేసే పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు.