మా పార్టీకి కొన్ని సిద్దాంతాలు ఉన్నాయి.. విజయసాయి కామెంట్స్..!

Friday, October 2nd, 2020, 04:36:42 PM IST

ఏపీ టీడీపీకి షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికలలో ఓటమిపాలైనప్పటి నుంచి టీడీపీ నుంచి పెద్ద ఎత్తున అధికార పార్టీ వైసీపీలోకి చేరికలు జరుగుతున్నాయి. ఇప్పటికే గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేశ్ వంటి వారు ఇప్పటికే టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీకి పరోక్షంగా మద్ధతు తెలుపుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా టీడీపీనీ వీడేందుకు సిద్దమయ్యాడు.

అయితే తాజాగా టీడీపీ ఎమ్మెల్యేల చేరికపై స్పందించిన విజయసాయి రెడ్డి రాష్ట్రంలో వైసీపీ పాలన చూసి చాలా మంది టీడీపీ శాసనసభ్యులు పార్టీలోకి రావడానికి సుముఖంగా ఉన్నారని, అయితే కొన్ని ప్రతిపాదనలు సీఎం జగన్ పరిశీలనలో ఉన్నాయని అన్నారు. మా పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని, ఎవరైనా పార్టీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని అన్నారు. పార్టీ ఆశయాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా సరైన సమయంలో జగన్ సరైన నిర్ణయం తీసుకుంటారని అన్నారు.