టీడీపీ నేతలు డమ్మీలుగా మారారు.. విజయసాయి రెడ్డి కామెంట్స్..!

Friday, February 12th, 2021, 02:09:24 AM IST

Ycp-mp-Vijayasai-reddy

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ నేతలపై సెటైరికల్ కామెంట్స్ చేశారు. పంచాయతీ తొలివిడత ఎన్నికల్లో టీడీపీ కంచుకోటలుగా చెప్పుకునేవాటికి బీటలు వారాయని, రెండో విడతలో ఇక అవి తునాతునకలేనని అన్నారు. అయితే సొంత నియోజకవర్గాల్లో తమవారిని గెలిపించుకోలేక టీడీపీ నేతలు డమ్మీలుగా మారారని విజయసాయి వ్యాఖ్యానించారు.

అంతేకాదు ప్రజల కోసం పోరాడుతున్నామని డబ్బా కొట్టుకునే అచ్చెన్న, ఉమ, యనమల నియోజకవర్గాల్లోని పంచాయతీలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసిందని, తునిలోని 58 పంచాయతీల్లో వైసీపీ మద్ధతుదారులు 54 స్థానాలలో గెలిచారని, మైలవరంలోని 48 పంచాయితీల్లో 44 స్థానాలు,టెక్కలిలో 135 పంచాయతీల్లో గెలిచామని విజయసాయి అన్నారు. మీరు పోరాడుతున్నది ప్రజల కోసం కాదు. ప్రజలకు వ్యతిరేకంగా బాబూ అంటూ కామెంట్స్ చేశారు.