40 ఏళ్ల ఇండస్ట్రీ కొడుకు తుక్కైపోయాడు.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

Saturday, May 15th, 2021, 01:07:47 PM IST


వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడు, లోకేశ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ కుమారుడు జగన్ సీఎం అయ్యి రికార్డ్స్ సృష్టించారని, స్టాలిన్ కుమారుడు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచాడు. కేసీయార్ కుమారుడు కేటీఆర్ గెలిచాడు. ములాయం కుమారుడు గెలిచాడు. థాక్రే కుమారుడు గెలిచాడు. 40 ఏళ్ల ఇండస్ట్రీ కొడుకు మాత్రం తుక్కైపోయాడని కానీ స్టాన్ ఫోర్డ్ ప్రోడక్ట్ అని చంద్రబాబు, లోకేశ్‌లు బిల్డప్ ఇస్తారని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.

ఇక అంతకముందు ప్రభుత్వం వద్దని మొత్తుకున్నా కట్టప్ప లాంటి నిమ్మగడ్డను వాడుకుని చంద్రబాబు స్థానిక ఎన్నికలు జరిపించాడని, కరోనా వ్యాప్తికి కుట్ర పన్నిన పాపం ఆయనను, పచ్చ బ్యాచిని వదిలి పెట్టదు. ఎన్నికలు లేకుంటే పాజిటివ్ కేసుల్లో రాష్ట్రం చిట్ట చివరన ఉండేది. ఇంత ఆందోళనకర పరిస్థితులు ఉండేవి కాదని విజయసాయి అన్నారు.