ఆ అధికారం హైకోర్ట్‌కు లేదు.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

Friday, September 18th, 2020, 07:00:30 PM IST

Vijaya_sai

ఏపీలోని అమరావతి భూములు, ఫైబర్‌నెట్ అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో నిరసనలు తెలిపారు. అయితే దీనిపై మీడియాతో మాట్లాడిన ఎంపీ విజయసాయి రెడ్డి సీబీఐ విచారణ కోరినా హైకోర్ట్ స్టే విధించిందని గ్యాగ్ ఆర్డర్ రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యని, సెక్షన్ 14 ప్రకారం అది విరుద్ధమని హైకోర్టుకు ఆ అధికారం లేదని చెప్పుకొచ్చారు.

అయితే ఉన్నత న్యాయస్థానం ఇలా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 19(3) ప్రకారం విచారణపై హైకోర్టు స్టే ఇవ్వకూడదని మరి కోర్టు ఎందుకు స్టే ఇచ్చిందో తెలీయదని. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే స్టే విధించే హక్కు కోర్టుకు ఉంటుందని అన్నారు. అయితే ప్రత్యేక పరిస్థితులు ఏపీలో లేవని, సాధారణ పరిస్థితుల్లో విచారణపై స్టే విధించే హక్కు ఏ కోర్టుకు లేదని అన్నారు.