బాబు, ఉమల అవినీతిపై చర్చ పెడితే ఐదేళ్లయినా పూర్తి కాదు – విజయసాయి రెడ్డి

Wednesday, January 20th, 2021, 03:00:09 AM IST

Ycp-mp-Vijayasai-reddy
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై, మాజీ మంత్రి దేవినేని ఉమాపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. బాబు, ఉమల అవినీతిపై చర్చ పెడితే ఐదేళ్లయినా పూర్తి కాదని ఎద్దేవా చేశారు. ఇసుక మాఫియా నడిచింది నీ కనుసన్నల్లోనే కదా ఉమా అని ప్రశ్నిస్తూ, ఇరిగేషన్ ప్రాజెక్టుల అంచనాలను 100 శాతానికి పైగా పెంచి ప్రజాధనాన్ని దోచుకున్నదెవరు అని నిలదీశారు. దీనిపై దర్యాప్తు మొదలవుతుందనే వణుకుతోనే ఇలా డ్రామాలు మొదలు పెట్టావని విజయసాయి ఆరోపించారు.

ఇదిలా ఉంటే అంతకు ముందు వలంటీర్లది గోనే సంచులు మోసే బండ చాకిరీ అని చంద్రబాబు మాట్లాడరని, ఐదు వేల జీతం ఒక ఉద్యోగమేనా అని చంద్రబాబు హేళన చేశారని కానీ ఈ రోజు క్యాన్సర్ బారిన పడిన చిన్నారిని కాపాడేందుకు శ్రీకాకుళం నుంచి బెంగళూరు వెళ్లి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చిన వలంటీరు గురించి దేశమంతా ప్రశంసించిందని, వారి విలువేంటో ఇప్పుడైనా తెలిసిందా బాబు గారు అని విజయసాయి అన్నారు.