బాబుకు నొప్పి కలిగితే ఎల్లోకులమీడియా విలవిలలాడుతుంది – విజయసాయి రెడ్డి

Saturday, March 27th, 2021, 02:09:50 AM IST


టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు. బాబుకు నొప్పి కలిగితే ఎల్లోకులమీడియా విలవిలలాడుతుందని, అమరావతి అసైన్డ్ భూములను చౌకగా కొట్టేసిన స్కాంలో ‘యజమాని’ని కాపాడేందుకు నానా తిప్పలు పడుతోందని అన్నారు. అంతేకాదు సంబంధం లేని వారిని బాధితులుగా చూపి తమనెవరూ మోసం చేయలేదని, ఇష్టం ప్రకారమే భూములు అమ్మామని చెప్పిస్తోందని అన్నారు.

ఇక అంతకు ముందు దళితులంటే చంద్రబాబుకు మొదటి నుంచీ చులకన, ఛీత్కారం అని అన్నారు. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని అన్నప్పుడే అయన నరనరాల్లో ఎంత ఏహ్య భావం దాగి ఉందో అర్థమైందని, అసైన్డ్ భూములు కొల్లగొడతాడు. గవర్నర్, రాజ్యసభ పదవులు ఎంతమందికి ఇప్పించాడో తెలుసు కదా? అని ఇంత మోసపు బతుకు అవసరమా బాబూ అంటూ ఎద్దేవా చేశారు.