పచ్చ పార్టీని పదిమైళ్ల లోతున పాతిపెట్టారు జనం – విజయసాయి రెడ్డి

Saturday, March 13th, 2021, 07:02:11 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు బరితెగించి పోయాడని, మ్యానిప్యులేషన్లతో రాష్ట్రాన్ని శాసించిన తను అనామకుడిగా మారడాన్ని జీర్ణించుకోలేక జగన్ గారిని దుర్భాషలాడాడని అన్నారు. ఆయన హుందాతనం కోల్పోకుండా తీర్పు చెప్పే అవకాశం ప్రజలకే వదిలేశారని, పచ్చ పార్టీని పదిమైళ్ల లోతున పాతిపెట్టారు జనం అని అన్నారు.

ఇక అంతకుముందు రాజకీయ పార్టీ స్థాపించడం వెనక అందరి లక్ష్యం సేవ చేయడమే అని, ప్రజా విశ్వాసం చూరగొని అధికారంలోకి రాగలిగితే ఆపన్నులను ఆదుకునే అవకాశం దొరుకుతుందని, గెలిచాక చేద్దాం, చూద్దాం అని కాలం వెళ్లదీసే నేతలే ఎక్కువ అని 20 నెలల్లో రూ.80 వేల కోట్ల సంక్షేమ ఫలాల అందించడం జగన్ గారికే సాధ్యమైందని అన్నారు.