చంద్రబాబే హిందుత్వంపై దాడులకు మూలకారకుడు – విజయసాయి రెడ్డి

Wednesday, September 9th, 2020, 09:34:55 AM IST

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. తూర్పుగోదావరి జిల్లాలోని సుప్రసిద్ధ అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయం యొక్క రథానికి నిప్పు అంటుకుని కాలి బూడవ్వడంపై భక్తులు, హిందూ సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నాయి. అయితే ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

అయితే తునిలో రైలు, అమరావతిలో తోటలు తగలబెట్టించి, విజయవాడలో గుడులు కూల్చి, అమరేశ్వరుడి భూములు మింగి, పుష్కరాల్లో 7 వేల కోట్లు ఆరగించి, దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేయించి, అంతర్వేదిలో రథానికి నిప్పు పెట్టించాడు. పాప భీతి, దైవ భక్తి ఏనాడూ లేనివాడు. ఆ బాబే హిందుత్వంపై దాడులకు మూలకారకుడు అని చంద్రబాబుపై విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు.